త్వరలోనే ప్రారంభించాలని ఆదేశం
హైదరాబాద్ – సీఎం రేవంత్ రెడ్డి దూకుడు పెంచారు. సంచలన నిర్ణయాలు తీసుకుంటూ పాలనా పరంగా తనదైన ముద్ర కనబరుస్తున్నారు. ప్రతి రోజూ సచివాలయంలో వివిధ శాఖలపై సమీక్షలు చేస్తూ పరుగులు పెట్టిస్తున్నారు.
ప్రస్తుతం ఒకప్పుడు కొందరికే పరిమితమైన ఈ అంబేద్కర్ భవనం ఇప్పుడు రోజూ వివిధ పనుల నిమిత్తం వచ్చీ పోయే ప్రజలతో కళ కళ లాడుతోంది. ప్రజాస్వామ్య స్పూర్తిని కలిగించేలా ఉందంటూ ప్రశంసలు కురుస్తున్నాయి. ప్రధానంగా జయ జయ హే తెలంగాణ పాటకు అరుదైన గుర్తింపు కల్పించేలా చేయడంలో కీలక పాత్ర పోషించారు సీఎం రేవంత్ రెడ్డి.
ఇదిలా ఉండగా తెలంగాణకే తల మానికంగా పేరు పొందింది నిజాం చక్కెర కర్మాగారం. గత కేసీఆర్ సర్కార్ దీని గురించి పట్టించు కోలేదు. పడావు పడిన దానిని పునరుద్దరించాలన్న సోయి కూడా లేకుండా పోయింది. తాజాగా రేవంత్ రెడ్డి ఈ అంశంపై ప్రధానంగా సమీక్ష చేపట్టారు. ఈ మేరకు సీఎస్ కు కీలక ఆదేశాలు జారీ చేశారు.
మూత పడిన ఈ ఫ్యాక్టరీని యుద్ద ప్రాతిపదికన తెరిపించేందుకు సమగ్ర నివేదికను అందించాలని స్పష్టం చేశారు. ఈ మేరకు కేబినెట్ సబ్ కమిటీ చైర్మన్ గా ఉన్న దుద్దిళ్ల శ్రీధర్ బాబుకు సూచించారు.