ప్రకటించిన సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి
దావోస్ – దావోస్ వేదికగా సంచలన ప్రకటన చేశారు సీఎం ఎ. రేవంత్ రెడ్డి. ఈ సందర్బంగా ట్రిలియన్ ట్రీ ఉద్యమంలో భాగం అవుతామని ప్రమాణం చేశారు. పర్యావరణ పరిరక్షణలో పాలుపంచుకుంటామని పేర్కొన్నారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ లో భాగంగా తెలంగాణ పెవిలియన్ ను సందర్శించారు వన్ ట్రిలియన్ ట్రీ ఆర్గనైజేషన్ నిర్వాహకులు. తెలంగాణ రైజింగ్ విధానంలో పర్యావరణ పరిరక్షణకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు స్పష్టం చేశారు సీఎం.
ఈ కార్యక్రమంలో వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యురాలు, నేచర్ పాజిటివ్ పిల్లర్ సహ వ్యవస్థాపకురాలు నికోల్ ష్వాబ్, నిర్వాహకులు ఫ్లోరియన్ వెర్నాజ్ పాల్గొన్నారు. ఇదిలా ఉండగా దావోస్ లో ఫుల్ బిజీగా ఉన్నారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి. ఆయనతో పాటు ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్ పర్యటిస్తున్నారు.
ప్రస్తుతం వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఆధ్వర్యంలో జరుగుతున్న సదస్సులో వీరు పాల్గొంటున్నారు. నిన్న అరుదైన సన్నివేశం చోటు చేసుకుంది. ముగ్గురు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి, దేవేంద్ర ఫడ్నవీస్ పాల్గొన్నారు. తమ తమ రాష్ట్రాలలో జరుగుతున్న అభివృద్ది పనుల గురించి వివరించే ప్రయత్నం చేశారు.