NEWSTELANGANA

ఎస్సీ వ‌ర్గీక‌ర‌ణ‌పై కమిటీ ఏర్పాటు

Share it with your family & friends

సీఎం ఎ. రేవంత్ రెడ్డి ప్ర‌క‌ట‌న

హైద‌రాబాద్ – తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి ఎ. రేవంత్ రెడ్డి కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. ఎస్సీ వ‌ర్గీక‌ర‌ణ‌పై ఆయ‌న ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ఎస్సీ వ‌ర్గీక‌ర‌ణ‌కు సంబంధించి న్యాయం చేసేందుకు గాను ఒక క‌మిటీని ఏర్పాటు చేస్తామ‌న్నారు సీఎం.

ఆ క‌మిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా అంద‌రికీ న్యాయం జ‌రిగేలా చూస్తామ‌ని స్ప‌ష్టం చేశారు ఎ. రేవంత్ రెడ్డి. ఇదిలా ఉండ‌గా ఎస్సీ వ‌ర్గీక‌ర‌ణ‌పై సుప్రీంకోర్టు మార్గర్శకాలకు అనుగుణంగా మాల, మాదిగలకు సరైన న్యాయం జరిగేలా చూడాలని కోరుతూ మాల సామాజికవర్గం ప్రజాప్రతినిధులు, మాల మహానాడు నేతలు అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రిని క‌లిశారు.

ఎస్సీ వర్గీకరణలో మాలలకు అన్యాయం జరగకుండా చూడాలని వారు అభ్యర్థించారు. ముఖ్యమంత్రిని కలిసిన వారిలో ఎమ్మెల్యేలు వివేక్ వెంకటస్వామి, మట్టా రాగమయి, చిక్కుడు వంశీకృష్ణ, కేఆర్ నాగరాజు , ఎంపీ గడ్డం వంశీకృష్ణ, మాల మహానాడు నేతలు చెన్నయ్య తదితరులు ఉన్నారు.

ఈ సంద‌ర్బంగా వారంతా సీఎంకు త‌మ‌కు న్యాయం చేయాల‌ని కోరుతూ ఓ విన‌తి ప‌త్రం స‌మ‌ర్పించారు. అంద‌రికీ మేలు జ‌రిగేలా చూస్తాన‌ని మామీ ఇచ్చారు ఎ. రేవంత్ రెడ్డి.