వంశీ చందర్ కే ఎంపీ సీటు
ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి
కోస్గి – మహబూబ్ నగర్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఎవరు పోటీ చేస్తారనే దానిపై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. రాష్ట్రంలో త్వరలో ఎన్నికలు జరగనున్నాయి. ఇటీవలే ప్రముఖ పారిశ్రామిక వేత్త ఎంపీ శ్రీనివాస్ రెడ్డి సోదరుడు జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.
దీంతో ఆయనకే ఎంపీ సీటు వస్తుందని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. కానీ అనూహ్యంగా ఇవాళ కోస్గి లో జరిగిన భారీ బహిరంగ సభ వేదికగా రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే చల్లా వంశీ చందర్ రెడ్డినే అభ్యర్థిగా ఎంపిక చేశామని స్పష్టం చేశారు.
ఇక సీటు విషయంలో క్లారిటీ ఇచ్చామని, ఇక గెలిపించాల్సిన బాధ్యత మీ అందరిపై ఉందన్నారు. ఒకవేళ 50 వేల మెజారిటీ ఇస్తే రూ. 5వేల కోట్లు కోడంగల్ నియోజకవర్గానికి మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు.
మీరందించిన ఆదరాభిమానాలే తనను సీఎంగా చేశాయని కొనియాడారు రేవంత్ రెడ్డి. ఆనాడు వలస వచ్చిన కేసీఆర్ ను ఎంపీగా గెలిపించిన చరిత్ర ఈ జిల్లా వాసులందని తెలిపారు. కానీ 10 ఏళ్లు ఉండి ఏం చేశావో చెప్పాలంటూ నిలదీశారు రేవంత్ రెడ్డి.