ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి
హైదరాబాద్ – సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. వికారాబాద్ ను ఎకో టూరిజం స్పాట్ గా చేస్తామన్నారు. తెలంగాణ రాష్ట్రానికి కావల్సింది టెంపుల్ టూరిజం, హెల్త్ టూరిజం, ఎకో టూరిజం అన్నారు. గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో పూర్తిగా పర్యాటక రంగం నిర్లక్ష్యానికి లోనైందని ఆవేదన వ్యక్తం చేశారు.
కానీ తమ ప్రజా ప్రభుత్వం కొలువు తీరాక టూరిజంపై ఫోకస్ పెట్టామని చెప్పారు. ఇదిలా ఉండగా తన సంపాదనపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు మెగాస్టార్ చిరంజీవి. తన సంపాదన తగ్గి పోయిందని వాపోయారు.
ఇదిలా ఉండగా ప్రపంచంలోనే మొట్ట మొదటిసారిగా ప్రకృతి ప్రేమికుల కోసం 25 వేల జాతుల మొక్కలతో 150 ఎకరాల విస్తీర్ణంలో మన హైదరాబాద్‌లోనే పచ్చని సుందరవనం లాంటి “ఎక్స్‌పీరియంషను ఏర్పాటు చేశారు.
దీనిని సీఎం ఎనుముల రేవంత్ రెడ్డితో పాటు మెగాస్టార్ చిరంజీవి, మంత్రి జూపల్లి కృష్ణారావు హాజరయ్యారు.