ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్ – రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. ఆయన పార్లమెంట్ ఎన్నికల సందర్బంగా కీలక వ్యాఖ్యలు చేశారు ప్రముఖ ప్రసిద్ద పుణ్య క్షేత్రమైన యాదగిరిగుట్టపై. గతంలో కొలువు తీరిన కేసీఆర్ సర్కార్ కావాలని తెలంగాణ లోని దేవాలయాల పేర్లను మార్చేసింది. దీనికి పేర్లను పెట్టారు ప్రముఖ ఆధ్యాత్మిక గురు శ్రీశ్రీశ్రీ త్రిదండి రామానుజ చిన్న జీయర్ స్వామీజీ.
పేదల తిరుపతిగా పేరు పొందిన యాదగిరి గుట్ట ఆలయానికి పేరు మార్చేశారు మాజీ సీఎం కేసీఆర్. దానికి యాదాద్రి అని పేరు పెట్టారు. దీనిని గెజిట్ లో కూడా చేర్చారు. ఇదే సమయంలో భద్రాచలం ఆలయాన్ని భద్రాద్రిగా మార్పు చేశారు. ఎన్నికల సందర్భంగా సంచలన ఆరోపణలు చేశారు సీఎం రేవంత్ రెడ్డి.
తాము అధికారంలోకి వచ్చిన వెంటనే తెలంగాణ అస్తిత్వానికి ప్రతీకగా ఉండే ఆలయాల పేర్లను తిరిగి పునరుద్దరిస్తామని , ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదన్నారు. తాజాగా జరిగిన ఎన్నికల ప్రచారంలో ఇదే కీలక ప్రకటన చేశారు. ఫలితాలు వచ్చిన వెంటనే యాదాద్రి పేరును యాదగిరిగుట్టగా మారుస్తామని స్పష్టం చేశారు సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి.
తన తర్వాత సీఎం అయ్యే ఛాన్స్ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి మాత్రమే ఉందన్నారు . ఆయన చేసిన కామెంట్స్ కలకలం రేపుతున్నాయి.