స్పష్టం చేసిన ఎ. రేవంత్ రెడ్డి
హైదరాబాద్ – మనం తీసుకున్న గొప్ప నిర్ణయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. రేపటి నుంచి జూన్ 2 వరకు ఎమ్మెల్యేలు ఆయా నియోజకవర్గాల్లోని ప్రతీ గ్రామాన్ని పర్యటించేలా కార్యాచరణ ఉండాలని స్పష్టం చేశారు. తాను కూడా మే 1 నుంచి జూన్ 2 వరకు ప్రజలతో మమేకం అవడానికి సమయం కేటాయిస్తానని అన్నారు. సన్న బియ్యం పథకం మన పేటెంట్, బ్రాండ్ అని పేర్కొన్నారు. సన్నబియ్యం పథకం ఒక అద్భుతమని పేర్కొన్నారు. ఆనాడు రూ.2 కిలో బియ్యంలా ఇప్పుడు సన్నబియ్యం పథకం శాశ్వతంగా గుర్తుండే పథకమన్నారు.
సన్న బియ్యం బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎందుకు ఇవ్వడం లేదో చెప్పాలని బీజేపీని, మోదీని, కేంద్ర మంత్రులను నిలదీయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. తెలంగాణ పథకాలతో ప్రధాని మోదీ ఊక్కిరి బిక్కిరి అవుతున్నారంటూ ఎద్దేవా చేశారు. కుల గణన సర్వే దేశానికి ఆదర్శంగా మారిందన్నారు. ఇవాళ ఎస్సీ వర్గీకరణ అమలుకు సంబంధించి ఆర్డినెన్స్ ఇచ్చామన్నారు. ఈ ఘనత తనకే దక్కిందని చెప్పారు సీఎం .నిన్న మొన్నటి వరకు బండి సంజయ్, కిషన్ రెడ్డి మనపై విమర్శలు చేశారని అయినా జనం వారిని నమ్మడం లేదన్నారు. సీఎల్పీ సమావేశంలో దిశా నిర్దేశం చేశారు.