Monday, April 21, 2025
HomeNEWSఆర్ఆర్ టోల్ కాంట్రాక్టుపై విచార‌ణ‌

ఆర్ఆర్ టోల్ కాంట్రాక్టుపై విచార‌ణ‌

విచార‌ణ‌కు ఆదేశించిన సీఎం

హైద‌రాబాద్ – సీఎం ఎ. రేవంత్ రెడ్డి సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. గ‌త బీఆర్ఎస్ ప్ర‌భుత్వ హ‌యాంలో అడ్డ‌గోలుగా తీసుకున్న నిర్ణ‌యాల‌పై చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని ప్ర‌క‌టించారు. ఇదే స‌మ‌యంలో మాజీ మంత్రి హ‌రీశ్ రావుపై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. త‌ప్పులు చేసింది చాల‌క వాటిని స‌రి పెట్టుకునే ప్ర‌య‌త్నం చేయ‌డం ప‌ట్ల మండిప‌డ్డారు.

ప్ర‌తిప‌క్షం కోరిక మేర‌కు ఔట‌ర్ రింగ్ రోడ్డుకు సంబంధించిన టోల్ కాంట్రాక్టుపై సిట్ (స్పెష‌ల్ ఇన్విస్టిగేష‌న్ టీం)ను ఏర్పాటు చేస్తున్న‌ట్లు వెల్ల‌డించారు ఎ. రేవంత్ రెడ్డి. ఈ సంద‌ర్భంగా విచార‌ణ‌కు ఆదేశిస్తున్న‌ట్లు తెలిపారు.

టెక్ ఫ్రీ చేసిన ఔటర్ రింగ్ రోడ్డును అప్పనంగా అమ్ముకుని ఎన్నికల ముందు హడావిడి చేసిన చరిత్ర గత ప్రభుత్వానిదని సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు సీఎం. ఇవాళ సభ్యులందరి ఆమోదంతో పూర్తిస్థాయి విచారణకు ఆదేశిస్తున్నామ‌ని చెప్పారు.

ఇదే స‌మ‌యంలో మంత్రివర్గంలో చర్చించి విధి విధానాలు రూపొందిస్తామ‌న్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments