NEWSTELANGANA

డిసెంబ‌ర్ క‌ల్లా 2 ల‌క్ష‌ల జాబ్స్ భ‌ర్తీ

Share it with your family & friends

ప్ర‌క‌టించిన సీఎం రేవంత్ రెడ్డి

హైద‌రాబాద్ – తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. తాము చెప్పిన‌ట్టుగానే ప్ర‌జా పాల‌న కొన‌సాగుతోంద‌న్నారు. ఇచ్చిన హామీ మేర‌కు ఈ ఏడాది డిసెంబ‌ర్ నాటిక‌ల్లా రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 2 ల‌క్ష‌ల ఉద్యోగాల‌ను భ‌ర్తీ చేసి తీరుతామ‌ని స్ప‌ష్టం చేశారు రేవంత్ రెడ్డి.

అర్హులైన నిరుద్యోగులు ఎవ‌రూ కూడా ఆందోళ‌న చెంద వ‌ద్ద‌ని, ఎవ‌రినీ ఆశ్ర‌యించ వ‌ద్ద‌ని, క‌ష్ట‌ప‌డి చ‌దువ‌కోవాల‌ని పిలుపునిచ్చారు. నిరుద్యోగ యువ‌త‌కు తాము ఇచ్చిన మాట‌కు క‌ట్టుబ‌డి ఉంటామ‌ని మ‌రోసారి ప్ర‌క‌టించారు రేవంత్ రెడ్డి.

తెలంగాణ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ ద్వారా పోలీస్ శాఖ‌లో త‌క్ష‌ణ‌మే 15,000 పోస్టుల‌ను భ‌ర్తీ చేస్తామ‌న్నారు . గ‌తంలో కొలువు తీరిన కేసీఆర్ స‌ర్కార్ త‌మ వారికి ప‌ద‌వులు ఇచ్చు కోవ‌డంలో ఫోక‌స్ పెట్టారే త‌ప్పా నిరుద్యోగుల ఆశ‌ల‌ను తీర్చాల‌న్న సోయి మ‌రిచి పోయార‌ని మండిప‌డ్డారు. అందుకే ప్ర‌జ‌లు కోలుకోలేని రీతిలో దెబ్బ కొట్టారంటూ మండిప‌డ్డారు.

ఎవ‌రు క్ష‌మించినా చ‌రిత్ర కేసీఆర్ ను క్ష‌మించ‌ద‌న్నారు సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి. త‌న ప్ర‌భుత్వాన్ని కూల్చ‌డం ఆయ‌న త‌రం కాద‌న్నారు.