ఏపీ ఎన్నికల ప్రచారంలో రేవంత్
ప్రకటించిన మాణిక్కం ఠాకూర్
హైదరాబాద్ – తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారారు. ప్రస్తుతం పార్టీ పరంగా ఆయన కీలకమైన వ్యక్తిగా మారారు. రాష్ట్రంలో పార్టీకి పూర్వ వైభవాన్ని తీసుకు రావడంలో కీలక పాత్ర పోషించారు. ఆక్టోపస్ లా విస్తరించిన కేసీఆర్ సారథ్యం లోని బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని పడగొట్టడంలో సక్సెస్ అయ్యారు.
వచ్చే నెలలో కేంద్ర ఎన్నికల సంఘం పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ జారీ చేయనుంది. దీంతో రాష్ట్రంలోని 17 స్థానాలలో హస్తం జెండా ఎగుర వేసేందుకు ఇప్పటి నుంచే వ్యూహాలు పన్నుతున్నారు. మరో వైపు బీఆర్ఎస్ , బీజేపీ సైతం సత్తా చాటాలని చూస్తున్నాయి.
ఇప్పటికే పాలనా పరంగా రేవంత్ రెడ్డి తనదైన ముద్ర కనబర్చారు. ప్రతి రోజూ సమీక్షలు చేస్తూ అధికారులను పరగులు పెట్టిస్తున్నారు. ఇదే సమయంలో ఏపీలో అసెంబ్లీతో పాటు లోక్ సభ ఎన్నికలు జరగనున్నాయి.
ఈ మేరకు ఏపీ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇంఛార్జ్ మాణిక్కం ఠాగూర్ కీలక ప్రకటన చేశారు. ఏపీలో జరిగే ఎన్నికల ప్రచారంలో పార్టీ తరపున రేవంత్ రెడ్డి ప్రచారం చేస్తారని వెల్లడించారు.