NEWSTELANGANA

శంక‌ర‌న్..శ్రీ‌ధ‌ర‌న్ లాగా ప‌ని చేయాలి

Share it with your family & friends

ఐఏఎస్ ల‌కు సీఎం రేవంత్ దిశా నిర్దేశం

హైద‌రాబాద్ – పాల‌నా ప‌రంగా ప్ర‌భుత్వానికి క‌లెక్ట‌ర్లు, ఎస్పీలు క‌ళ్లు లాంటి వార‌ని అన్నారు సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి. మంగ‌ళ‌వారం స‌చివాలంయ‌లో క‌లెక్ట‌ర్లు, పోలీస్ క‌మిష‌న‌ర్లు, ఎస్పీల‌తో ఏర్పాటు చేసిన విస్తృత స‌మావేశంలో ఆయ‌న ప్ర‌సంగించారు. ఈ స‌మావేశంలో డిప్యూటీ సీఎం భ‌ట్టి విక్ర‌మార్క‌తో పాటు మంత్రులు పాల్గొన్నారు.

ప్ర‌తి అధికారి శంక‌ర‌న్ , శ్రీ‌ధ‌ర‌న్ లాగా ప‌ని చేయాల‌ని పిలుపునిచ్చారు. ప్ర‌జ‌ల‌కు మెరుగైన సేవ‌లు అందించ‌డంలో, ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న సంక్షేమ ప‌థ‌కాలు, కార్య‌క్ర‌మాలు వారికి చేర వేయ‌డంలో కీల‌క‌మైన పాత్ర పోషించాల్సి ఉంటుంద‌న్నారు.

ప్ర‌ధానంగా సామాన్యుల‌కు గుర్తుండి పోయేలా పాల‌న ఉండాల‌న్నారు. ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా మానవీయ కోణంలో ప్రజలకు సేవలు అందించాలని చెప్పారు. అధికారులు తీసుకునే ప్రతి చర్యా ఇది ప్రజా ప్రభుత్వం అని ప్రజలకు తెలిసేలా ఉండాలన్నారు.

సంక్షేమం, అభివృద్ధిని సమ తూకం చేసుకుంటూ ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పారు. ప్రజా సమస్యలను అర్థం చేసుకుని పరిష్కరించడంలో కలెక్టర్లు విధిగా క్షేత్రస్థాయిలో పర్యటించాలని ఆదేశించారు.

ప్రజల నుంచి అందుతున్న దరఖాస్తుల్లో నిజమైన లబ్దిదారులను గుర్తించి సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని స్పష్టం చేశారు. ఆరు గ్యారంటీలను పారదర్శకంగా అమలు చేసే బాధ్యత మీపైనే ఉందని అన్నారు.

ఈ సమావేశంలో ప్రజా పాలన, ధరణి సమస్యలు, ఖరీఫ్ వ్యవసాయం, ప్రజారోగ్యం – సీజనల్ వ్యాధులు, వన మహోత్సవం, మహిళాశక్తి, విద్య, శాంతి భద్రతలు, మాదక ద్రవ్యాల నిర్మూలనకు తీసుకుంటున్న చర్యల వంటి అనేక అంశాలపై ముఖ్యమంత్రి చ‌ర్చించారు.