NEWSTELANGANA

దాత‌లు స్పందించండి విరాళాలు ఇవ్వండి

Share it with your family & friends

విన్న‌వించిన తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్

హైద‌రాబాద్ – తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి ఎ. రేవంత్ రెడ్డి కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. ఆయ‌న ట్విట్ట‌ర్ ఎక్స్ వేదిక‌గా దాత‌లు, వ్యాపార‌వేత్త‌లు, కార్పొరేట్ కంపెనీలు, సంస్థ‌లు, మ‌న‌సున్న మారాజులు, ఆట‌గాళ్లు, సీఈవోలు, మేనేజింగ్ డైరెక్ట‌ర్లు, ఆస్ప‌త్రుల య‌జ‌మానులు..ఉద్యోగులు వెంట‌నే స్పందించాల‌ని కోరారు. త‌మ వంతు సాయంగా ఆదుకోవాల‌ని కోరారు. ఎన్ని డ‌బ్బులు ఉంటే అన్ని త‌మ‌కు ఇవ్వాల‌ని విన్న‌వించారు సీఎం.

అకాల వ‌ర్షాల కార‌ణంగా తెలంగాణ రాష్ట్ర ప‌రిస్థితి ద‌య‌నీయంగా మారింద‌ని, ప్ర‌స్తుతం ఖ‌జానా ఖాళీ అయ్యింద‌ని, ఆదుకునేందుకు త‌మ వ‌ద్ద డ‌బ్బులు లేవ‌ని పేర్కొన్నారు. ఈ త‌రుణంలో వ‌ర‌ద బాధితులకు ఆప‌న్న హ‌స్తం ఇచ్చేందేఉకు రాష్ట్ర స‌ర్కార్ కు ప్ర‌తి ఒక్క‌రూ అండ‌గా నిల‌వాల‌ని కోరారు రేవంత్ రెడ్డి.

“వరద బాధితులను ఆదుకోవడానికి చేతనైనంత సహాయాన్ని అందించండి. మానవత్వం ప్రదర్శించాల్సిన సమయమిది” అని అన్నారు ముఖ్య‌మంత్రి.

తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) కి విరాళాలు ఆన్ లైన్ బ్యాంకింగ్ ద్వారా గానీ, చెక్కుల రూపంలోగానీ లేదంటే యూపీఐ పేమెంట్ యాప్స్ నుంచి ఈ క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేసిగానీ పంపించాల‌ని సూచించారు సీఎం.