గద్దర్ అవార్డుల ప్రకటనపై స్పందించండి
తెలుగు సినీ పరిశ్రమ పెద్దలకు సీఎం పిలుపు
హైదరాబాద్ – తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రముఖ దివంగత ప్రజా యుద్ద నౌక గద్దర్ పేరుతో సినీ రంగానికి సంబంధించి అవార్డులను ఇవ్వనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే సీఎంగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం గద్దర్ పేరు మీద పురస్కారాలను ఇవ్వనున్నట్లు తెలిపారు.
గతంలో ప్రభుత్వం నంది పేరుతో సినీ రంగానికి సంబంధించి అవార్డులు ఇస్తూ వచ్చింది. కానీ ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తెలంగాణలోనే కాదు యావత్ భారత దేశంలోనే తన అద్భుతమైన గొంతుకతో ప్రజల తరపున పాటల పాడాడని , చైతన్యవంతం చేశాడని కొనియాడారు సీఎం రేవంత్ రెడ్డి.
దీనిపై టాలీవుడ్ పరిశ్రమకు సంబంధించి చేసిన ప్రకటనపై మాట్లాడేందుకు, స్పందించేందుకు నిరాకరించారు. గతంలో గద్దర్ నక్సలైట్ ఉద్యమానికి మద్దతు ప్రకటించారు. ఆయన అందులో పాలు పంచుకున్నారు.
అప్పటి ప్రభుత్వం నిషేధం ఎత్తి వేసిన తర్వాత జన బాహుళ్యంలోకి వచ్చారు. కాంగ్రెస్ పార్టీకి మద్దతు ప్రకటించారు. తొలి దశ, మలిదశ ఉద్యమానికి ఊపిరి పోశాడు గద్దర్. ఆయనకు నివాళిగా గద్దర్ పేరుతో అవార్డులు ఇవ్వాలని నిర్ణయించారు సీఎం. సినీ పరిశ్రమకు చెందిన వారు వెంటనే స్పందించాలని కోరారు రేవంత్ రెడ్డి.