దేశంలోనే నెంబర్ వన్ సీఎం బాబు
హైదరాబాద్ – దేశంలోనే అత్యంత సంపన్నమైన సీఎంల జాబితాను ప్రకటించింది ఏడీఆర్ సంస్థ. మొత్తం 31 మంది సీఎంల ఆస్తుల వివరాలను వెల్లడించింది. తాజాగా దేశ వ్యాప్తంగా జరిగిన ఎన్నికల్లో ఆయా సీఎంలు సమర్పించిన అఫిడవిట్ల ఆధారంగా ర్యాంకులు ప్రకటించింది. తొలి స్థానంలో ఏపీ సీఎం చంద్రబాబు ఉండగా 7వ స్థానంలో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారు. అత్యంత పేద సీఎంగా మమతా బెనర్జీ నిలిచారు.
కాగా టీడీపీ చీఫ్, సీఎం నారా చంద్రబాబు నాయుడు రూ.931 కోట్ల ఆస్తులతో అత్యంత సంపన్నమైన సీఎంగా నిలిచాడు. రూ.332 కోట్ల ఆస్తులతో అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి పెమా ఖండూ రెండో స్థానంలో ఉండగా చివరి స్థానంలో కేవలం రూ. 15 లక్షల సంపదతో టీఎంసీ చీఫ్, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ నిలిచారు.
కేంద్ర ఎన్నికల సంఘానికి సమర్పించిన ముఖ్యమంత్రుల అఫిడవిట్లు, నామినేషన్ పత్రాల విశ్లేషణ ఆధారంగా అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) నివేదిక రూపొందించింది. దీదీ తన అఫిడవిట్ లో రూ. 15,38,029 విలువైన ఆస్తులు ఉన్నట్లు పేర్కొంది.