కమ్మ సామాజిక వర్గానికి సీఎం భరోసా
సమస్యలు పరిష్కరిస్తానని హామీ
హైదరాబాద్ – తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కమ్మ సామాజిక వర్గానికి ఏవైనా సమస్యలు ఉన్నట్టయితే వెంటనే పరిష్కరిస్తానని స్పష్టం చేశారు. గురువారం తనను మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు కమ్మ సామాజిక వర్గానికి చెందిన నేతలు. ఈ సందర్బంగా వారు సీఎంను అభినందనలతో ముంచెత్తారు.
తెలంగాణలో ఉన్న కమ్మ వారు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వారి సమస్యలను సావధానంగా విని పరిష్కరించేందుకు చర్యలు చేపట్టాలని కోరారు. ఈ సామాజిక వర్గానికి చెందిన ప్రతినిధులు సీఎం ఎనుముల రేవంత్ రెడ్డికి వినతి పత్రం సమర్పించారు.
ఇదిలా ఉండగా రాష్ట్ర సర్కార్ కమ్మ సామాజిక వర్గానికి మేలు చేకూర్చేందుకు గాను కమ్మ కార్పొరేషన్ ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి. ఈ సందర్బగా ఆ వర్గానికి చెందిన ప్రజా ప్రతినిధులు సీఎంకు ధన్యవాదాలు తెలిపారు. తమ ప్రభుత్వం ప్రజా పాలనను అందిస్తోందన్నారు.