ఈనెల 20 నుంచి 24 వరకు సదస్సు
హైదరాబాద్ – ఈనెల 20 నుంచి 24వ తేదీ వరకు జరిగే దావోస్ సదస్సులో పాల్గొననున్నారు సీఎం ఎ. రేవంత్ రెడ్డి. అంతకు ముందు 15 నుంచి 19 వరకు నాలుగు రోజుల పాటు ముఖ్యమంత్రి బృందం ఆస్ట్రేలియాలో పర్యటిస్తుంది. క్వీన్స్ లాండ్ స్పోర్ట్స్ యూనివర్శిటీని పరిశీలిస్తారు. 19,20 తేదీలలో సింగపూర్ లో పారిశ్రామికవేత్తలతో రేవంత్ రెడ్డి భేటీ కానున్నారు. తెలంగాణకు పెట్టుబడులే లక్ష్యంగా సీఎం టూర్ ఉండనుంది.
ఇదిలా ఉండగా ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు తీరాక సీఎం రేవంత్ రెడ్డి దూకుడు పెంచారు. ప్రధానంగా మౌలిక వసతుల కల్పనపై ఎక్కువగా ఫోకస్ పెట్టారు. విదేశీ ప్రయాణం చేశారు. పలు కంపెనీల ప్రతినిధులతో భేటీ అయ్యారు.
తెలంగాణ ప్రభుత్వం కీలక ఒప్పందాలు చేసుకుంది. ఐటీ, లాజిస్టిక్, ఫార్మా హబ్ గా తెలంగాణను చేయాలన్నది తమ సంకల్పమని ఇప్పటికే స్పష్టం చేశారు సీఎం ఎ. రేవంత్ రెడ్డి. ఇదే సమయంలో క్రీడాభివృద్దికి ప్రయారిటీ ఇస్తామన్నారు. ఇందులో భాగంగా స్పోర్ట్స్ యూనివర్శిటీని ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు.
ఇందులో భాగంగానే ప్రస్తుతం ఆయా దేశాలలో క్రీడా యూనివర్శిటీలను పరిశీలించనున్నారు.