వెళ్లనున్న సీఎస్..స్పోర్ట్స్ చైర్మన్
హైదరాబాద్ – తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి జనవరి 14న ఆస్ట్రేలియాలో పర్యటించనున్నారు. ఆయనతో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, స్పోర్ట్స్ చైర్మన్ కూడా వెళతారు. రెండు రోజుల పాటు జరిగే ఈ టూర్ లో క్వీన్ లాండ్ లోని స్పోర్ట్స్ యూనివర్శిటీని సందర్శిస్తారు. అక్కడి నుండి 16న సింగపూర్ కు వెళతారు. క్రీడా ప్రాంగణాలను పరిశీలిస్తారు. తెలంగాణలో అత్యాధునిక వసతులతో స్పోర్ట్స్ యూనివర్శిటీని ఏర్పాటు చేయనున్నారు.
ఇదిలా ఉండగా ప్రపంచంలోని టాప్ యూనివర్శిటీలకు ధీటుగా ఇక్కడ ఏర్పాటు చేయబోయే స్పోర్ట్స్ యూనివర్శిటీ ఉండాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు స్పష్టం చేశారు సీఎం ఎ. రేవంత్ రెడ్డి. ఎన్ని కోట్లు అయినా సరే తాము ఖర్చు చేసేందుకు సిద్దంగా ఉన్నామని చెప్పారు.
ప్రభుత్వం ఎక్కడా వెనుకంజ వేసే ప్రసక్తి లేదన్నారు. ఒలింపిక్స్ నిర్వహించేందుకు తాము సిద్దంగా ఉన్నామని తెలిపారు సీఎం.