సీఎం జాతీయ క్రీడా దినోత్సవ శుభాకాంక్షలు
మేజర్ ధ్యాన్ చంద్ ను స్మరించు కోవడం
హైదరాబాద్ – దేశ వ్యాప్తంగా ఆగస్టు 29న జాతీయ క్రీడా దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ఈ సందర్బంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి స్పందించారు. జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకుని క్రీడాకారులు, క్రీడాభిమానులందరికీ పేరు పేరునా శుభాకాంక్షలు తెలిపారు . హాకీ దిగ్గజం దివంగత మేజర్ ధ్యాన్ చంద్ జయంతిని జాతీయ క్రీడా దినోత్సవంగా దేశం నిర్వహిస్తూ వస్తోంది.
మేజర్ ధ్యాన్ చంద్ జయంతిని జాతీయ క్రీడా దినోత్సవాన్ని జరుపు కోవడం మనందరికీ గర్వ కారణమని పేర్కొన్నారు. నా దేశాన్ని ముందుకు తీసుకు వెళ్లడమే నా ముందున్న ప్రథమ కర్తవ్యం అని చెప్పిన మహనీయుడు, అరుదైన ఆటగాడు మేజర్ ధ్యాన్ చంద్ అని ప్రశంసించారు. ఆయన పేరు చెబితేనే ముందుగా గుర్తుకు వచ్చేది హాకీ అని తెలిపారు సీఎం.
మేజర్ ధ్యాన్ చంద్ మాటలను ఆదర్శంగా తీసుకుని క్రీడలకు తమ ప్రజా ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని స్పష్టం చేశారు ఎ. రేవంత్ రెడ్డి. ఇందులో భాగంగానే యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్శిటీని నెలకొల్పడం జరుగుతోందని తెలిపారు.
జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో తెలంగాణ క్రీడాకారులు సత్తా చాటేలా ఈ వర్సిటీలో ఒలింపిక్ స్థాయి సౌకర్యాలు, శిక్షణ అందించే ఏర్పాట్లు చేస్తున్నామని ఎ. రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.