ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కామెంట్స్
ఢిల్లీ – తెలంగాణ దేశానికి రోల్ మోడల్ అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. గుజరాత్ మోడల్ ను ఎవరూ స్వీకరించడం లేదన్నారు. ప్రధాని మోదీకి తన వ్యక్తిగత ప్రచారం మీద ఉన్నంత ధ్యాస దేశం పట్ల లేదన్నారు. ఢిల్లీలో ఇండియా టుడే ఎన్ క్లేవ్ లో పాల్గొని ప్రసంగించారు. ప్రజలు ప్రత్యామ్నాయ రాజకీయాల గురించి ఆలోచిస్తున్నారని చెప్పారు. హైదరాబాద్ ఐటీ, ఫార్మా, లాజిస్టిక్, రియల్ ఎస్టేట్ కు కేరాఫ్ గా ఉందన్నారు. కేసీఆర్ ఒక్కరి వల్ల తెలంగాణ అభివృద్ది చెందలేదన్నారు. గతంలో చిన్నారెడ్డి, వైఎస్ఆర్, చంద్రబాబు నాయుడు వల్ల అభివృద్ది జరిగిందన్నారు. దానిని నేను ప్రస్తుతం తీసుకు పోయేందుకు ప్రయత్నం చేస్తున్నానన్నారు.
గుజరాత్ నమూనాలో ఏవిధమైన సంక్షేమం లేదన్నారు. ఏమైనా అభివృద్ధి ఉందనుకుంటే అది మోదీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రయత్నించిందేనని ఎద్దేవా చేశారు . మోదీ ఈ దేశానికి ప్రధానమంత్రి.. దేశంలో ఏమూలకైనా పెట్టుబడులు వస్తే వాటికి ఆయన మద్దతు ఇవ్వడం లేదన్నారు. ఎవరైనా దేశానికి పెట్టుబడులు పెట్టడానికి వస్తే గుజరాత్‌కు వెళ్లి పెట్టుబడులు పెట్టమని చెబుతున్నారు.. ఇదేం పద్ధతి అంటూ మండిపడ్డారు. నాది అభివృద్ధి, సంక్షేమం, సుపరిపాలన నమూనా… ఈ మూడు మా ప్రాధాన్యాంశాలు.. అహ్మదాబాద్.. హైదరాబాద్ లోని మౌలిక వసతులను పోల్చి చూడండి.. మా హైదరాబాద్‌లో ఉన్న వసతులు.. అహ్మదాబాద్‌లో ఉన్న వసతులు చూడండి.
హైదరాబాద్‌తో పోటీ పడే ఔటర్ రింగు రోడ్డు, అంతర్జాతీయ విమానాశ్రయం అహ్మదాబాద్‌కు ఉన్నాయా? గుజరాత్‌లో ఫార్మా, ఐటీ పెట్టుబడులు ఉన్నాయా..? గుజరాత్‌లో ఏం ఉంది? నేను అహ్మదాబాద్, ముంబయి, బెంగళూర్, ఢిల్లీతో పోటీ పడడం లేదు.. నేను న్యూయార్క్, సియోల్, టోక్యో తో పోటీపడాలని అనుకుంటున్నాం. మా తెలంగాణ నమూనాతో ఎవరూ పోటీ పడలేరన్నారు.