NEWSTELANGANA

మీ ప్ర‌య‌త్నం ప్ర‌శంసనీయం

Share it with your family & friends

సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి

సికింద్రాబాద్ – జీవితంలో అత్యంత ముఖ్య‌మైనది విద్యపై ఫోక‌స్ పెట్ట‌డ‌మేన‌ని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. గురువారం సికింద్రాబాద్ ఆర్మీ కాలేజ్ ఆఫ్ డెంట‌ల్ సైన్సెస్ స్నాతకోత్స‌వం జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథిగా హాజ‌ర‌య్యారు రేవంత్ రెడ్డి.

ఈ సంద‌ర్భంగా ఆయ‌న విద్యార్థుల‌ను ఉద్దేశించి ప్ర‌సంగించారు. సికింద్రాబాద్ ఆర్మీ కాలేజ్ ఆఫ్ డెంటల్ సైన్సెస్ (ఏసీడీఎస్) ద్వారా సైనికుల పిల్లలకు సేవలు అందించడం దేశానికీ గర్వకారణమని అన్నారు సీఎం.

ఈ స్నాతకోత్సవ వేడుకలో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. పట్టాలు అందుకున్న విద్యార్థులను ప్ర‌త్యేకంగా పేరు పేరునా అభినందించారు. మీ కృషి, అంకితభావం మిమ్మల్ని ఇక్కడికి తీసుకువచ్చాయ‌ని అన్నారు సీఎం.

ఈ రోజు నుంచి మీరు కొత్త ప్రయాణాన్ని ప్రారంభించ బోతున్నారని, మ‌రింత బాధ్య‌త‌తో మెల‌గాల‌ని సూచించారు రేవంత్ రెడ్డి. మీరు మీ సక్సెస్‌ను ఆస్వాదించండి, కానీ ఎప్పుడూ మీ బాధ్యతను మరిచి పోవద్దని సూచించారు.

మీరు చేసే పనులు మీకు, మీ కుటుంబానికే కాదు మీ కాలేజీకి కూడాఉ గుర్తింపును తీసుకొస్తాయ‌న్న సంగతి మ‌రిచి పోవ‌ద్ద‌ని అన్నారు. వివిధ కోర్సుల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థినీ, విద్యార్థులకు ఈసందర్భంగా మెరిట్ సర్టిఫికేట్లను అందజేశారు. ఎసీడీఎస్‌ ఆంధ్ర, తెలంగాణ సబ్ ఏరియా చైర్మన్ మేజర్‌ జనరల్ రాకేష్ మనోచా, ఇతర అధికారులు పాల్గొన్నారు.