మెగాస్టార్ కు రేవంత్ రెడ్డి కంగ్రాట్స్
పద్మ విభూషణ్ రావడం అభినందనీయం
హైదరాబాద్ – కేంద్ర ప్రభుత్వం భారత దేశ అత్యున్నత రెండవ పౌర పురస్కారం పద్మ విభూషణ్ ను ప్రకటించింది ఏపీకి చెందిన ముప్పవరుపు వెంకయ్య నాయుడుతో పాటు సినీ రంగంలో కీలకమైన దిగ్గజ నటుడిగా గుర్తింపు పొందిన చిరంజీవికి. ఈ సందర్భంగా సినీ, క్రీడా, సాంస్కృతిక, వ్యాపార, వాణిజ్య, రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖులు అభినందనలతో ముంచెత్తారు.
తన జీవితం ధన్యమైందని, పౌర పురస్కారాన్ని ప్రకటించినందుకు కేంద్ర సర్కార్ కు, ప్రత్యేకించి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి ధన్యవాదాలు తెలిపారు చిరంజీవి. ఇదిలా ఉండగా పద్మ భూషణ్ అవార్డు వచ్చిన సందర్భాన్ని పురస్కరించుకుని మెగాస్టార్ కోడలు, అపోలో ఆస్పత్రుల యాజమాన్యానికి చెందిన , మెగాస్టార్ తనయుడు నటుడు రామ్ చరణ్ భార్య ఉపాసన కొణిదెల ఆధ్వర్యంలో అభినందన సభ ఏర్పాటు చేశారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి, రాష్ట్ర రోడ్లు, భవనాల , సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి హాజరయ్యారు. మెగాస్టార్ ను సీఎం ప్రత్యేకంగా అభినందించారు.