సీఎంను కలిసిన చైర్మన్లు
ఒబేదుల్లా..తాహెర్ బిన్
హైదరాబాద్ – పలు కార్పొరేషన్లకు చైర్మన్లు, డైరెక్టర్లను నియమించే పనిలో పడ్డారు సీఎం రేవంత్ రెడ్డి. మొత్తం 40 కార్పొరేషన్లు ఉన్నాయి. ఇప్పటి వరకు ప్రెస్ అకాడమీ చైర్మన్ గా శ్రీనివాస్ రెడ్డిని నియమించారు. మాజీ డీజీపీ మహేందర్ రెడ్డిని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ గా బాధ్యతలు అప్పగించారు.
ఇదే సమయంలో మహేందర్ రెడ్డిపై లక్ష కోట్ల అవినీతి ఆరోపణలు వచ్చాయి. ఆధారాలతో సహా ప్రముఖ లాయర్ గవర్నర్ తమిళి సై సౌందర రాజన్ కు ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు.
ఇదే సమయంలో తాజాగా ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన ఒబేదుల్లా కొత్వాల్ కు ఊహించని రీతిలో పదవి దక్కింది. ఆయనకు తెలంగాణ రాష్ట్ర మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ పదవి వరించింది. ఎన్నికల సందర్బంగా ఆయనకు రావాల్సిన టికెట్ ను ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డికి దక్కింది. ఇదే పాలమూరుకు చెందిన పలువురు నేతలలో సంజీవ్ ముదిరాజ్ , ఎన్పీ వెంకటేశ్, రాఘవేంద్ర రాజు , హనీఫ్ అహ్మద్ ఉన్నారు. వీరికి కూడా పదవులు దక్కాల్సి ఉంది.
శనివారం తమను చైర్మన్లుగా నియమించిన సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు. రెడ్డిని కలుసుకున్న వారిలో మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ ఒబేదుల్లా కొత్వాల్, ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హుందాన్, క్రిష్టియన్ కార్పొరేషన్ చైర్మన్ దీపక్ జాన్ ఉన్నారు.