అండర్ -19 వరల్డ్ కప్ లో సత్తా చాటింది
హైదరాబాద్ – అండర్ 19 వరల్డ్ కప్ భారత్ కైవసం చేసుకోవడంలో కీలక పాత్ర పోషించిన తెలంగాణ క్రికెటర్ గొంగిడి త్రిష సీఎం రేవంత్ రెడ్డిని తన నివాసంలో మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్బంగా ఆమెను అభినందించారు. రాష్ట్రానికి పేరు తీసుకు రావడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా తన ఆటతో దేశానికి గర్వ కారణంగా నిలిచిన త్రిషకు రూ. కోటి నజరానా ప్రకటించారు సీఎం.
రాబోయే రోజుల్లో రాష్ట్రానికి పేరు తీసుకు రావాలని ఆకాంక్షించారు ఎ. రేవంత్ రెడ్డి. తనకు భారీ పారితోషకం ప్రకటించినందుకు ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు గొంగిడి త్రిష. ఆమె స్వస్థలం భద్రాచలం. ఈ కార్యక్రమంలో రాష్ట్ర రెవిన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా ఉన్నారు.
ఇదిలా ఉండగా మలేషియాలో జరిగిన అండర్ 19 వరల్డ్ కప్ ఫైనల్ లో ఆల్ రౌండర్ ప్రతిభతో ఆకట్టుకుంది త్రిష. ప్రత్యర్థి సౌతాఫ్రికా జట్టును కేవలం 82 రన్స్ కే పరిమితం చేసింది. ఇందులో త్రిష 3 వికెట్లు తీసింది. అనంతరం 83 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించింది భారత్ కేవలం ఒక వికెట్ కోల్పోయి మాత్రమే. ఇందులో 44 రన్స్ చేసింది గొంగిడి త్రిష. నాటౌట్ గా నిలిచింది. ఇదే వరల్డ్ కప్ టోర్నీలో సెంచరీ చేసిన తొలి మహిళగా రికార్డ్ నమోదు చేసింది.