సైక్లిస్ట్ ఆశా మాల్వీయాకు అభినందన
సాహసోపేతమైన చర్యగా పేర్కొన్న రేవంత్
హైదరాబాద్ – సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆదివారం ఆయన సైక్లిస్ట్ ఆశా మాల్వీయాను ప్రత్యేకంగా అభినందనలతో ముంచెత్తారు. తనను కలుసుకున్న ఆమెను ప్రోత్సహించేలా మాట్లాడారు.
మహిళల్లో భద్రత, సాధికారత సాధించాలనే లక్ష్యంతో దేశ వ్యాప్తంగా సోలోగా సైకిల్ యాత్రకు శ్రీకారం చుట్టింది యువతి సైక్లిస్ట్ ఆశా మాల్వీయా. తన పర్యటనలో భాగంగా ఆమె మర్యాద పూర్వకంగా సీఎం రేవంత్ రెడ్డిని తన నివాసంలో కలుసుకున్నారు.
సమున్నత ఆశయం కోసం దేశ వ్యాప్తంగా ఏకంగా 25 వేల కిలోమీటర్లను ప్రయాణం చేసేలా లక్ష్యంగా పెట్టుకోవడం ఆషా మాషీ వ్యవహారం కాదన్నారు ఈ సందర్బంగా సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి. దాదాపు 28 రాష్ట్రాల మీదుగా సైకిల్ యాత్ర కొనసాగిస్తుండడం మామూలు విషయం కాదన్నారు.
ఆశా మాల్వీయా నేటి యువ తరానికి మార్గదర్శకంగా ఉంటుందని , ఈ సందర్బంగా ఆమె తన టార్గెట్ ను విజయవంతంగా పూర్తి చేసుకోవాలని ఆకాంక్షించారు తెలంగాణ ముఖ్యమంత్రి.