డీఎస్సీ అభ్యర్థులకు కంగ్రాట్స్
సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి
హైదరాబాద్ – తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. గురువారం ట్విట్టర్ ఎక్స్ వేదికగా స్పందించారు. తమ ప్రభుత్వం వచ్చాక ఆయన కీలక నిర్ణయం తీసుకున్నారు. 2012లో నిర్వహించిన డీఎస్సీ తర్వాత దాదాపు 12 ఏళ్ల అనంతరం తన హయాంలో డీఎస్సీ పరీక్ష నిర్వహిస్తుండడం తనకు సంతోషాన్ని కలిగిస్తోందని పేర్కొన్నారు సీఎం.
జూలై 18 గురువారం నుంచి ఆగస్టు 5 వరకు దశల వారీగా డీఎస్సీ పరీక్ష నిర్వహిస్తోందని స్పష్టం చేశారు ఎనుముల రేవంత్ రెడ్డి. ఈ సందర్బంగా డీఎస్సీ పరీక్షలకు హాజరవుతున్న లక్షలాది మంది అభ్యర్థులకు శుభాకాంక్షలు తెలిపారు.
కొన్నేళ్ల తర్వాత జరుగుతున్న ఈ డీఎస్సీ ద్వారా మీ కలలు ఫలించాలని, మీ భవిష్యత్తు బాగుండాలని ఆయన ఆకాంక్షించారు. తమ ప్రభుత్వం ఉద్యోగాల భర్తీపై దృష్టి సారించిందని, అనవసర ఆందోళనకు గురి కాకుండా ప్రశాంతంగా పరీక్షలు రాయాలని సూచించారు ఎనుముల రేవంత్ రెడ్డి.
మీ కలలు ఫలించాలని, భావి భారత పౌరులను తీర్చిదిద్దే పవిత్రమైన ఉపాధ్యాయ వృత్తిలోకి రావాలని ఆయన కోరారు.