గ్రూప్ -1 అభ్యర్థులకు సీఎం కంగ్రాట్స్
మెయిన్స్ కు 31,382 మంది అభ్యర్థులు
హైదరాబాద్ – తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆదివారం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) చైర్మన్ మహేందర్ రెడ్డి గ్రూప్ -1 పరీక్షలకు సంబంధించి నిర్వహించిన ప్రిలిమ్స్ ఫలితాలను ప్రకటించారు.
ఈ సందర్బంగా గ్రూప్ -1 మెయిన్స్ కు 31 వేల 382 మంది అభ్యర్థులు ఎంపికయ్యారు. ఈ మెయిన్స్ పరీక్షలను టీజీపీఎస్సీ వచ్చే అక్టోబర్ నెల 21 నుంచి 27వ తేదీ వరకు నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు.
గ్రూప్ -1 మెయిన్స్ కు ఎంపికైన ప్రతి ఒక్కరికీ పేరు పేరునా అభినందనలు తెలియ చేస్తున్నట్లు స్పష్టం చేశారు తెలంగాణ ముఖ్యమంత్రి. అయితే ప్రాథమిక పరీక్షలో ఫెయిల్ అయిన అభ్యర్థులు నిరుత్సాహ పడవద్దని సూచించారు.
జీవితంలో లక్ష్యాన్ని నిర్దోషించు కోవడం , దాని కోసం ప్రయత్నం చేయడం గమ్యం కావాలని మెయిన్స్ అభ్యర్థులకు పిలుపునిచ్చారు ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి.