పాలమూరు బిడ్డకు ప్రశంస
సివిల్స్ లో 3వ ర్యాంకు
పాలమూరు జిల్లా – ఉమ్మడి పాలమూరు జిల్లా అడ్డాకుల మండలం పొన్నకల్ గ్రామానికి చెందిన డోనూరి అనన్యా రెడ్డి చరిత్ర సృష్టించారు. ఎంతో ప్రతిష్టాత్మకమైన యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) నిర్వహించిన పరీక్షలో అద్భుతమైన ప్రతిభ కనబర్చారు. ఏకంగా దేశంలోనే 3వ ర్యాంకు సాధించారు. ఆమె ఐఏఎస్ కు ఎంపికయ్యారు. ఇవాళ యూపీఎస్సీ దేశ వ్యాప్తంగా ఫలితాలను ప్రకటించింది.
ఈ సందర్బంగా 2023వ సంవత్సరానికి సంబంధించి ఇరు తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు ఉత్తీర్ణులయ్యారు. ఈ సందర్బంగా పేరు పేరునా సివిల్స్ సాధించిన ప్రతి ఒక్కరికీ అభినందనలు తెలియ చేశారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి.
ఈ మేరకు తన స్వంత జిల్లా నుంచి డోనూరి అనన్యా రెడ్డి ఐఏఎస్ కు ఎంపిక కాపడం పట్ల తనకు ఎంతగానో సంతోషంగా ఉందన్నారు సీఎం. త్వరలోనే ఆమెను త్వరలోనే సన్మానించడం జరుగుతుందని స్పష్టం చేశారు రేవంత్ రెడ్డి. అంతే కాకుండా ఏఐసీసీ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ, దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ సైతం సివిల్స్ విజేతలకు అభినదనలు తెలిపారు.