సాయి చరణ్ కు సీఎం సన్మానం
కాపాడడం అభినందనీయం
హైదరాబాద్ – భారీ అగ్ని ప్రమాదం నుంచి కాపాడిన లిటిల్ హీరో సాయి కిరణ్ ను ఘనంగా సన్మానించారు సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి. ఆదివారం తన నివాసంలో సాయి కిరణ్ తో పాటు వారి కుటుంబాన్ని ప్రశంసలతో ముంచెత్తారు.
ఇదిలా ఉండగా ఏప్రిల్ 26న హైదరాబాద్ లోని నందిగామ లోని ఆల్విన్ హోమియో ఫార్మా కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మంటలు చెలరేగడంతో దీనిని గుర్తించాడు సాయి కిరణ్. తాడును తీసుకుని భవనంపై విసిరాడు. లోపల చిక్కుకు పోయి ఇబ్బందుల్లో ఉంటూ హాహాకారాలు చేస్తున్న కార్మికులను రక్షించాడు.
దీంతో సాయి కిరణ్ రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాడు. విచిత్రం ఏమిటంటే ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం సంభవించ లేదు. ఈ సందర్బంగా ఎంతో చాక చక్యంతో , సాహసోపేతంతో వ్యవహరించి కార్మికుల ప్రాణాలను కాపాడిన సాయి చరణ్ నిజంగా అభినందనీయుడని పేర్కొన్నారు సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి.
చిన్న వయసులోనే ఇలాంటి ధైర్య సాహసాలు ప్రదర్శించడం తనను మరింత విస్తు పోయేలా చేసిందన్నారు. రాబోయే కాలంలో అతడికి మంచి భవిష్యత్తు ఉండాలని ఆకాంక్షించారు.