స్పోర్ట్స్ పాలసీని తీసుకు వస్తున్నాం
హైదరాబాద్ – అర్జున అవార్డు అందుకున్న తెలంగాణకు చెందిన పారా ఒలింపియన్ అథ్లెట్ దీప్తి జీవంజికి ప్రభుత్వ పరంగా సహాయ సహకారాలు అందజేస్తామని ప్రకటించారు సీఎం రేవంత్ తరెడ్డి. దేశంలోనే అత్యున్నత అవార్డు అందుకోవడం గర్వంగా ఉందన్నారు.
రాష్ట్రం నుంచి మరింత మంది క్రీడాకారులు జాతీయ, అంతర్జాతీయ పోటీలలో రాణించేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు సీఎం. స్పోర్ట్స్ పాలసీతో ముందుకు పోతోందని స్పష్టం చేశారు. ఈ సందర్బంగా ప్రత్యేకంగా దీప్తి జీవంజికి అభినందనలు తెలియ చేస్తున్నట్లు చెప్పారు.
ఈసారి ప్రవేశ పెట్టిన బడ్జెట్ లో కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం అత్యధికంగా బడ్జెట్ ను కేటాయించడం జరిగిందన్నారు. పెద్ద ఎత్తున నిధులను మంజూరు చేస్తామన్నారు. సింగపూర్ , ఆస్ట్రేలియాలలో స్పోర్ట్స్ యూనివర్శిటీలను పరిశీలించడం జరిగిందన్నారు రేవంత్ రెడ్డి.
అన్ని క్రీడా విభాగాలలో పాల్గొని తెలంగాణకు పేరు తీసుకు వచ్చేలా ప్రయత్నం చేయాలని సూచించారు.