క్రీడారంగానికి సర్కార్ పెద్దపీట
స్పష్టం చేసిన సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్ – తమ ప్రభుత్వం క్రీడా రంగంపై ఫోకస్ పెడుతోందని, అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందజేస్తామని స్పష్టం చేశారు సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి. క్రీడాకారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేస్తామన్నారు.
ఇదిలా ఉండగా తెలంగాణ ప్రాంతానికి చెందిన పలువురు క్రీడాకారులు వివిధ విభాగాలలో అద్భుతమైన ప్రతిభా పాటవాలను ప్రదర్శించేలా చేస్తున్నారంటూ కొనియాడారు. కాగా బంగారు పతకం సాధించిన తెలంగాణ సాఫ్ట్ బాల్ బాలికల జట్టు సీఎం రేవంత్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు. గెలుపొందిన జట్టును ప్రత్యేకంగా అభినందనలతో ముంచెత్తారు.
ఈ నెల 21 నుండి 25 వరకు బీహార్‌లోని పాట్నాలోని పాట్లీ పుత్ర స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో జరిగిన 41వ జూనియర్ నేషనల్ సాఫ్ట్ బాల్ ఛాంపియన్‌షిప్‌లో తెలంగాణ సాఫ్ట్ బాల్ బాలికల జట్టు బంగారు పతకాన్ని సాధించింది. సచివాలయంలో తెలంగాణ సాఫ్ట్ బాల్ అసోసియేషన్, బాలికల జట్టు ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డిని కలిశారు.