జాతీయ విపత్తుగా ప్రకటించాలి – సీఎం
కేంద్రాన్ని డిమాండ్ చేసిన రేవంత్ రెడ్డి
ఖమ్మం జిల్లా – తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాలు, వరదల కారణంగా అపారమైన నష్టం వాటిల్లిందన్నారు. ఇప్పటి వరకు వరదల కారణంగా 16 మంది ప్రాణాలు కోల్పోయారని, 5 లక్షల ఎకరాలకు పైగా పంట నష్టం జరిగిందన్నారు. రూ. 5500 కోట్లకు పైగా నష్టం వాటిల్లిందని వెంటనే జాతీయ విపత్తుగా ప్రకటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ యుద్ద ప్రాతిపదికన నిధులను విడుదల చేయాలని కోరారు. గతంలో ఎన్నడూ లేని రీతిలో భారీ వర్షాలు ముంచెత్తాయని చెప్పారు. ఖమ్మం జిల్లాలో పర్యటించారు రేవంత్ రెడ్డి. బాధితులను పరామర్శించారు. దెబ్బ తిన్న పంటల్ని, రోడ్లను పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు సీఎం.
సాయం చేయాల్సిన ప్రతిపక్షాలు నిరాధారమైన ఆరోపణలు చేయడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. కేటీఆర్ , హరీశ్ రావు, కేసీఆర్ లపై సెటైర్లు వేశారు. కేటీఆర్ అమెరికాలో ఎంజాయ్ చేస్తూ మంత్రులు పని చేయడం లేదంటు విమర్శలు చేయంపై ఫైర్ అయ్యారు.
జాతీయ విపత్తు గా ప్రకటించాలని బీఆర్ఎస్ ఎందుకు అడగడం లేదని ప్రశ్నించారు రేవంత్ రెడ్డి. రాజకీయ ప్రయోజనాల కోసం తాము పని చేయమన్నారు. ప్రజలకు కల్వకుంట్ల దోచుకున్న డబ్బులను ఇవ్వాలని కోరారు.