మోడీ రాజీనామా చేయాలి – సీఎం
యూపీ..మరాఠాలో ఓటమి పాలయ్యారు
హైదరాబాద్ – తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని లక్ష్యంగా చేసుకుని నిప్పులు చెరిగారు. ఈసారి జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు స్పష్టమైన మెజారిటీ భారతీయ జనతా పార్టీకి ఇవ్వలేదన్నారు.
ఉత్తర ప్రదేశ్ , మహారాష్ట్ర ప్రజలు మోడీకి కోలుకోలేని రీతిలో షాక్ ఇచ్చారని ఎద్దేవా చేశారు రేవంత్ రెడ్డి.
వ్యవస్థలను సర్వ నాశనం చేసి కేవలం పెట్టుబడిదారులకు మాత్రమే ఊడిగం చేస్తూ వచ్చారని ఆరోపించారు. ఇవాళ అన్ని వర్గాల ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆరోపించారు .
ఇదిలా ఉండగా ఎన్డీయే – బీజేపీ పార్లమెంటరీ సమావేశంలో పీఎం నరేంద్ర మోడీ కాంగ్రెస్ పార్టీని ఏకి పారేశారు. కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలలో ప్రజలు ఆ పార్టీని ఆదరించ లేదని ఆరోపించారు. దీనిపై స్పందించారు రేవంత్ రెడ్డి. మరాఠా, యూపీ లలో బీజేపీని తిరస్కరించారని దీనికి బాధ్యత వహిస్తూ వెంటనే మోడీ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.