ఎయిమ్స్ కు నిధులు ఇవ్వండి – సీఎం
కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రితో రేవంత్ భేటీ
న్యూఢిల్లీ – ఢిల్లీ పర్యటనలో బిజీ బిజీగా ఉన్నారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి. ఆయన ఇప్పటికే కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ను కలుసుకున్నారు. వివిధ అంశాలపై చర్చించారు ఇద్దరు .
మంగళవారం కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డాను కలిశారు. రాష్ట్రానికి సంబంధించి రావాల్సిన నిధుల గురించి తెలిపారు . ప్రధానంగా ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్ ) కు సంబంధదించి ఇంకా నిధులు విడుదల కాలేదని పేర్కొన్నారు .
గతంలో పలుమార్లు నిధులు మంజూరు చేయాలని కోరినా పట్టించు కోలేదని వాపోయారు సీఎం రేవంత్ రెడ్డి. తమకు రావాల్సిన వాటిని ఎందుకు ఆలస్యం చేస్తున్నారంటూ ప్రశ్నించారు. దీనిపై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు జేపీ నడ్డా.
ఎయిమ్స్ కు సంబంధించి ఎందుకు నిధులు రిలీజ్ కాలేదనే దానిపై ఆరా తీస్తానని, వెంటనే మంజూరు అయ్యేలా చేస్తామని హామీ ఇచ్చారు జేపీ నడ్డా.