5 ఎకరాల పొలం..ప్రభుత్వ ఉద్యోగం
హైదరాబాద్ – సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి ఔదార్యాన్ని చాటుకున్నారు. గతంలో దుండుగల కాల్పుల్లో నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గం కొండారెడ్డి పల్లెకు చెందిన యాదయ్య ప్రాణాలు కోల్పోయారు. ఈ ఊరు స్వంతూరు సీఎం రేవంత్ రెడ్డిది.
విషయం తెలుసుకున్న రేవంత్ రెడ్డి వెంటనే ఆ కుటుంబాన్ని ఆదుకుంటానని మాటిచ్చారు. ఇచ్చిన మాట మేరకు తాను సహాయం చేస్తానని హామీ ఇచ్చారు. ఆ వెంటనే తను సీఎంగా కొలువు తీరారు తెలంగాణ రాష్ట్రానికి.
తాను ఇచ్చిన మాట తప్పనని నిరూపించుకున్నారు. సీఎంఓ కార్యాలయం నుంచి బాధితురాలి కుటుంబానికి సమాచారం అందించారు. సీఎం రేవంత్ రెడ్డిని కలుసుకోవాలని. ఈ సందర్బంగా బుధవారం యాదయ్య కుటుంబానికి భరోసా ఇచ్చారు.
ఈ సందర్బంగా ఆ కుటుంబానికి ప్రభుత్వం తరపున ఐదు ఎకరాల భూమితో పాటు యాదయ్య సతీమణి సునీతమ్మకు ప్రభుత్వ ఉద్యోగం కూడా కల్పించారు. ఇందుకు సంబంధించి పొలానికి సంబంధించి పాసు పుస్తకంతో పాటు నియామక పత్రం అందజేశారు. తనకు ఇవాళ చాలా సంతోషంగా ఉందని పేర్కొన్నారు సీఎం.