Monday, April 21, 2025
HomeNEWSప‌ర‌మ‌త స‌హ‌నం వ‌ర్దిల్లాలి - సీఎం

ప‌ర‌మ‌త స‌హ‌నం వ‌ర్దిల్లాలి – సీఎం

క్రిస్మ‌స్ వేడుక‌ల్లో రేవంత్ రెడ్డి

హైద‌రాబాద్ – క్రిస్మ‌స్ పండుగ‌ను పుర‌స్క‌రించుకుని రాష్ట్ర ప్ర‌భుత్వం హైద‌రాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో ఏర్పాటు చేసిన క్రిస్మ‌స్ వేడుక‌ల్లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. చిన్నారుల‌కు క్రిస్మ‌స్ కానుక‌లు పంపిణీ చేశారు.

ప్ర‌భుత్వం భారీ ఎత్తున ఏర్పాట్లు చేసింది. సీఎంతో పాటు మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్, టీపీసీసీ చీఫ్ మ‌హేష్ కుమార్ గౌడ్, ప్ర‌భుత్వ స‌ల‌హాదారు ష‌బ్బీర్ అలీతో పాటు సీఎస్ శాంతి కుమారి పాల్గొన్నారు. ప్ర‌భుత్వం అన్ని వ‌ర్గాల‌కు మేలు చేకూర్చేలా ప్ర‌య‌త్నం చేస్తుంద‌న్నారు సీఎం.

ఆ ఏసు ప్రభువు ఆశీస్సులతో తెలంగాణ రాష్ట్రం సుఖ శాంతులతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు . రాష్ట్రంలో పరమత సహనం వర్ధిల్లాలని కోరారు. క్రిస్టియన్ సమాజానికి పవిత్ర క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియ చేశారు ఎ. రేవంత్ రెడ్డి. త‌మ ప్ర‌జా ప్ర‌భుత్వం క్రిష్టియ‌న్ల సంక్షేమం, అభివృద్ది కోసం కృషి చేస్తోంద‌ని చెప్పారు.

గ‌తంలో లేని విధంగా ఈసారి ప్ర‌వేశ పెట్టిన బ‌డ్జెట్ లో అత్య‌ధికంగా నిధుల‌ను కేటాయించ‌డం జ‌రిగింద‌ని అన్నారు. అన్ని వ‌ర్గాల‌కు స‌ముచిత స్థానం క‌ల్పిస్తామ‌ని పేర్కొన్నారు. ఈసారి వేడుక‌ల్లో ప్ర‌తి ఒక్క‌రు పాల్గొని సంతోషంగా ఉండాల‌ని సూచించారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments