NEWSTELANGANA

పాల‌మూరు నుంచి ఎన్నిక‌ల ప్ర‌చారం

Share it with your family & friends

ఈనెల 6న కాంగ్రెస్ ప్ర‌జా దీవెన స‌భ

హైద‌రాబాద్ – త్వ‌ర‌లో జ‌ర‌గ‌బోయే పార్ల‌మెంట్ ఎన్నిక‌ల‌కు సంబంధించి ప్ర‌చారానికి సిద్ద‌మంటూ ప్ర‌క‌టించింది. టీపీసీసీ చీఫ్ , తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి త‌న స్వంత జిల్లా పాల‌మూరు నుంచే ఎన్నిక‌ల శంఖారావానికి శ్రీ‌కారం చుట్ట‌నున్నారు.

ఈ మేర‌కు కీల‌క ప్ర‌క‌ట‌న కూడా చేశారు. ఇందుకు సంబంధించి ముహూర్తం కూడా ఖ‌రారు చేశారు. మార్చి 6న పాల‌మూరు వేదిక‌గా కాంగ్రెస్ ఎన్నిక‌ల శంఖారావం పూరించ‌నుంది. దీనికి పేరు కూడా ఖ‌రారు చేసింది. పాల‌మూరు ప్ర‌జా దీవెన బ‌హిరంగ స‌భ‌గా నామ‌క‌ర‌ణం చేసింది.

ఈ స‌భ ద్వారా రేవంత్ రెడ్డి ఎన్నిక‌ల క్యాంపెయిన్ ను ప్రారంభించ‌నున్నారు. ఇందుకు సంబంధించి సీఎంను క‌లిసి ఆహ్వానించారు సీడ‌బ్ల్యూసీ ప్ర‌త్యేక ఆహ్వానిత స‌భ్యుడు వంశీ చంద‌ర్ రెడ్డి, ప్ర‌జా ప్ర‌తినిధులు.

రేవంత్ రెడ్డిని క‌లిసిన వారిలో ఎమ్మెల్యేలు యెన్నం శ్రీ‌నివాస్ రెడ్డి, వాకిటి శ్రీ‌హ‌రి ముదిరాజ్ , జి. మ‌ధుసూద‌న్ రెడ్డి, వీర్ల‌ప‌ల్లి శంక‌ర్ , అనిరుధ్ రెడ్డితో పాటు మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేష‌న్ చైర్మ‌న్ ఒబేదుల్లా కొత్వాల్ ఉన్నారు.