రేవంత్ సన్మానం మోదీ సంతోషం
ఆదిలాబాద్ లో ఆసక్తికర సన్నివేశం
ఆదిలాబాద్ జిల్లాలో సోమవారం ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. గత ప్రభుత్వ హయాంలో సీఎంగా ఉన్న కేసీఆర్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీని గుర్తించ లేదు. పైపెచ్చు తీవ్రమైన ఆరోపణలు చేశారు. విమర్శలు గుప్పించారు. ముఖం చాటేశారు. కనీసం ప్రోటోకాల్ ను కూడా పాటించ లేదు. దీనిపై పెద్ద రాద్దాంతం చోటు చేసుకుంది.
కానీ రాష్ట్రంలో సీన్ మారింది. సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి సారథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా కొలువు తీరింది. కేసీఆర్ కు కోలుకోలేని రీతిలో షాక్ తగిలింది. ఓ వైపు కేంద్రంలో బీజేపీ సర్కార్ ఉన్నప్పటికీ రేవంత్ రెడ్డి తెలివిగా తన పని తాను చేసుకుంటూ పోతున్నారు.
పదవీ బాధ్యతలు చేపట్టిన వెంటనే రేవంత్ రెడ్డి ముందుగా కేంద్రం వద్దకు వెళ్లారు. ఢిల్లీలో ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్, నిర్మలా సీతా రామన్ , తదితరులను కలుసుకున్నారు.
తమకు మద్దతు ఇవ్వాలని కోరారు. ఇదే సమయంలో సోమవారం ఆదిలాబాద్ లో పలు అభివృద్ది పనులను ప్రారంభించారు ప్రధానమంత్రి మోదీ. సీఎం అన్నీ తానే అయి వ్యవహరించారు. మోదీకి శాలువా కప్పి సన్మానించారు.