NEWSTELANGANA

మూసీ న‌ది అభివృద్దిపై ఫోక‌స్

Share it with your family & friends

సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి

హైద‌రాబాద్ – సీఎం రేవంత్ రెడ్డి న‌గ‌ర అభివృద్దిపై ఎక్కువ‌గా ఫోక‌స్ పెట్టారు. ఆయ‌న ప‌దే ప‌దే మూసీ న‌ది ప‌రివాహ‌క అభివృద్ది పై దృష్టి సారించారు. సోమ‌వారం నాన‌క్ రామ్ గూడ హెచ్ఎండీఏ కార్యాల‌యంకు చేరుకున్నారు. అక్క‌డ ఎండీ సీఎంకు వివ‌రించారు. అనంత‌రం రేవంత్ రెడ్డి స‌మీక్షించారు.

మూసీ రివర్ బౌండరీస్ లొకేషన్ స్కెచ్ తో పాటు పలు వివరాలను సీఎం కు వివరించారు. ఈ సంద‌ర్బంగా రేవంత్ రెడ్డి మూసీ అభివృద్ధి ప్రక్రియ వీలైనంత త్వరగా ప్రారంభించేందుకు కసరత్తు పూర్తి చేయాలని అధికారుల‌ను ఆదేశించారు.
.
ఇందుకు ముందుగా మూసీ క్లీనింగ్ ప్రక్రియను పూర్తి చేయాలని సూచించారు.. నగరంలోని చారిత్రక కట్టడాలను కలుపుతూ ఉండేలా మూసీ అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించాల‌ని స్ప‌ష్టం చేశారు. అధికారులకు పని విభజన చేసి మూసీ నదీ పరివాహక అభివృద్ధికి చర్యలు వేగవంతం చేయాలని స్ప‌ష్టం చేశారు.

ఇప్ప‌టికే విదేశీ ప‌ర్య‌ట‌న‌లో మూసీ న‌ది ప‌రివాహ‌క అభివృద్దికి సంబంధించి ప‌లు సంస్థ‌ల‌తో భేటీ అయ్యారు రేవంత్ రెడ్డి.