స్కిల్ యూనివర్శిటీ ఏర్పాటు చేయాలి
యుద్ద ప్రాతిపదికన నిర్మాణం కావాలి
హైదరాబాద్ – తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే నైపుణ్యాభివృద్ధి గురించి పదే పదే ప్రస్తావిస్తూ వస్తున్నారు. రాష్ట్రానికి చెందిన విద్యార్థులు ఎందరో ఇంజనీర్ కోర్సులు చదువుతున్నారని, కానీ ప్రపంచానికి కావాల్సిన విధంగా తయారు కావడం లేదని పేర్కొన్నారు. ఇదే అంశంపై ఎక్కువగా ఇంజనీరింగ్ కాలేజీలు, యాజమాన్యాలు, ప్రత్యేకించి ప్రొఫెసర్లు ఆలోచించాలని సూచించారు ఎనుముల రేవంత్ రెడ్డి.
విద్యార్థులను ప్రపంచంతో పోటీ పడేలా చేయాలని స్పష్టం చేశారు. ఇందులో భాగంగానే హైదరాబాద్ నగరంలో తలమానికంగా నిలిచేలా స్కిల్ డెవలప్ మెంట్ యూనివర్శిటీని ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు. ఇప్పటికే స్థలాన్ని కూడా పరిశీలించారు సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి.
ప్రజా భవన్ లో సీఎం తో పాటు డిప్యూటీ సీఎం నైపుణ్యాభివృద్ది విశ్వ విద్యాలయం ఏర్పాటు గురించి సమీక్ష చేపట్టారు. స్కిల్ యూనివర్శిటీ ఏర్పాటు, ముసాయిదా, ఇతర ప్రాధాన్యత తో కూడిన అంశాలపై ప్రధానంగా చర్చించారు. యుద్ద ప్రాతిపదికన పూర్తి చేయాలని ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి.