NEWSTELANGANA

ద‌స‌రా పండ‌గ లోపు టీచ‌ర్ల భ‌ర్తీ

Share it with your family & friends

ప్ర‌క‌టించిన సీఎం ఎ. రేవంత్ రెడ్డి

హైద‌రాబాద్ – రాష్ట్ర ముఖ్య‌మంత్రి ఎ. రేవంత్ రెడ్డి కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. నిరుద్యోగ అభ్య‌ర్థుల‌కు తీపి క‌బురు చెప్పారు. ద‌స‌రా పండుగ లోపే డీఎస్సీలో ఎంపికైన వారికి నియామ‌క ప‌త్రాలు అంద‌జేస్తామ‌ని ప్ర‌క‌టించారు. డీఎస్సీ-2024 ఫలితాల విడుదల కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు.

11062 టీచర్ ఉద్యోగాల భర్తీకి విశేష కృషి చేసిన అధికారులకు అభినంద‌న‌లు తెలిపారు. 1:3 ప్రాతిపదికన ఫలితాలు ఫలితాలు విడుదల చేస్తామ‌న్నారు. త్వ‌ర‌లోనే తుది నియామ‌కాలు పూర్తి చేస్తామ‌ని ప్ర‌కటించారు. అక్టోబర్ 9న ఎల్బీ స్టేడియంలో నియామక పత్రాలు అందిస్తామ‌ని తెలిపారు రేవంత్ రెడ్డి.

గత ప్రభుత్వం పదేళ్లలో ఒకే ఒకసారి డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చిందని ఆరోపించారు. . పదేళ్లలో వాళ్లు చేపట్టిన ఉపాధ్యాయ నియామకాలు కేవలం 7,857 మాత్రమేన‌ని ఎద్దేవా చేశారు సీఎం.

విద్యను అందుబాటులోకి తీసుకు రావాలన్న ఆలోచన గత ప్రభుత్వానికి లేదన్నారు. తాము అధికారంలోకి రాగానే ఉపాధ్యాయ నియామకాల ప్రక్రియ మొదలు పెట్టామ‌ని చెప్పారు . విద్యకు త‌మ ప్రభుత్వం ప్రాధాన్యత ఇచ్చింద‌న్నారు.

నిర్వహణ నుంచి నియామకాల వరకు 65 రోజుల్లో 11062 ఉద్యోగాల నియామకాలు పూర్తి చేస్తున్నామ‌ని తెలిపారు. ఇది విద్యపై త‌మ‌ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ది అని తెలిపారు. తెలంగాణలో పేదలకు విద్యను అందుబాటులోకి తీసుకు రావాలన్నదే త‌మ‌ ఆకాంక్ష అని, అధికారంలోకి వచ్చిన 30 రోజుల్లోనే 30 వేల ఉద్యోగాల నియామక పత్రాలు అందించామ‌ని చెప్పారు.

నిరుద్యోగులను దృష్టిలో ఉంచుకుని టెట్ నిర్వహణ తర్వాతే డీఎస్సీ నిర్వహించామ‌న్నారు సీఎం. టీజీపీస్సీని ప్రక్షాళన చేశామ‌న్నారు . త్వరలోనే గ్రూప్ 1 ఫలితాలు ప్రకటించి తెలంగాణ పునర్నిర్మాణంలో వారిని కూడా భాగస్వామ్యం చేస్తామ‌ని ప్ర‌క‌టించారు.