NEWSTELANGANA

ఉద్యోగుల‌కు త్వ‌ర‌లో ఖుష్ క‌బ‌ర్

Share it with your family & friends

సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి

హైద‌రాబాద్ – తెలంగాణ రాష్ట్ర స‌ర్కార్ త్వ‌ర‌లో ఖుష్ క‌బ‌ర్ చెప్ప బోతోందంటూ ప్ర‌క‌టించారు సీఎం రేవంత్ రెడ్డి. ఉద్యోగుల‌కు సంబంధించిన డీఏ చెల్లింపులు చేసే విష‌యం ప‌రిశీలిస్తామ‌ని స్ప‌ష్టం చేశారు. ఇత‌ర అంశాల‌పై మంత్రివ‌ర్గంతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని అన్నారు.

ఎంసీఆర్‌హెచ్ఆర్డీలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక సంఘాలతో జరిగిన సమావేశంలో మాట్లాడారు రేవంత్ రెడ్డి. మీ సమస్యలను పరిష్కరించే బాధ్యత ప్రజా ప్రభుత్వం తీసుకుంటుందని అన్నారు. నిర్భంధాలతో పాలన కొనసాగిస్తామని అనుకోవడం భ్రమ అని పేర్కొన్నారు. త‌మ స‌ర్కార్ మా చర్చలు, సంప్రదంపులకు అవకాశం కల్పిస్తుందని చెప్పారు.

మీలో విశ్వాసం కల్పించడానికే చర్చలు జరిపామ‌ని తెలిపారు. మంత్రివర్గ ఉపసంఘం ఆయా సంఘాలతో చర్చలు, సంప్రదింపుల తర్వాతే ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుంద‌న్నారు సీఎం. మంత్రివర్గ ఉపసంఘం నియమించిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుచేశారు.

తెలంగాణ రాష్ట్రం విద్యార్థి, ఉద్యోగ, ఉపాద్యాయ కార్మిక సంఘాల పోరాటాలతోనే సిద్దించిందన్నారు. తామే సాధించామని ఏ ఒక్క రాజకీయ పార్టీ చెప్పుకున్నా అది అసంబద్ధమే అవుతుందని అన్నారు. మొదటి తారీఖునే ఉద్యోగులకు జీతాలు చెల్లించినా ప్రభుత్వం ప్రచారం చేసుకోలేదని చెప్పారు.