రైతులకు రేవంత్ ఖుష్ కబర్
ఆగస్టు 15 లోపు రుణాలు మాఫీ
భువనగిరి – రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. బీఆర్ఎస్ చేస్తున్న ఆరోపణలకు చెక్ పెట్టే ప్రయత్నం చేశారు. ఎన్నికల సందర్బంగా ఇచ్చిన గ్యారెంటీ మేరకు రైతులు తీసుకున్న రుణాలను మాఫీ చేస్తామని ప్రకటించారు. ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదన్నారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.
ప్రజలను ఉద్దేశించి ప్రసంగించిన రేవంత్ రెడ్డి రైతులకు తీపి కబురు చెప్పారు. ఆ యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహ స్వామి సాక్షిగా తాను మాటిస్తున్నానని , ఆగస్టు 15 లోపు రూ. 2 లక్షల వరకు పంట రుణాలను ఒకేసారి మాఫీ చేస్తామని స్పష్టం చేశారు.
ఆరు గాలం పండించే రైతులు ఆందోళనకు గురి కావద్దని సూచించారు. తాను కూడా పల్లెటూరి నుంచి, రైతు కుటుంబం నుంచి వచ్చిన వాడినని, తనకు ఆ రుణం బాధ ఏమిటో బాగా తెలుసన్నారు. రైతుల ఇబ్బందులు, కష్టాలు తాను దగ్గరుండి చూశానని , వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా చేస్తానని మాటిచ్చారు ఎనుముల రేవంత్ రెడ్డి.