65 లక్షల మందికి రైతు భరోసా
సీఎం ఎనుముల రవేంత్ రెడ్డి
హైదరాబాద్ – రాష్ట్రంలో ఇప్పటి వరకు 65 లక్షల మంది రైతులకు రైతు భరోసా కింద డబ్బులు జమ చేయడం జరిగిందని స్పష్టం చేశారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి. మొత్తంగా 69 లక్షల మంది రైతులు ఉన్నారని వెల్లడించారు. ఇంకా 4 లక్షల మంది రైతులకు రైతు భరోసా ఇవ్వాల్సి ఉందని చెప్పారు. మే 8వ తేదీ లోపు మిగిలి పోయిన వారికి కూడా జమ చేస్తామని ప్రకటించారు ఎనుముల రేవంత్ రెడ్డి.
ఎన్నికల్లో భాగంగా ఇప్పటి వరకు ఆరు గ్యారెంటీలను ప్రకటించామని, వాటిని అమలు చేసిన ఘనత తమ సర్కార్ కే దక్కుతుందన్నారు సీఎం. భారతీయ జనతా పార్టీ, భారత రాష్ట్ర సమితి పార్టీల నేతలు కావాలని తమను బద్నాం చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారంటూ ధ్వజమెత్తారు ఎనుముల రేవంత్ రెడ్డి.
వచ్చే ఆగస్టు 15వ తేదీ లోపు రైతులకు ఇప్పటి వరకు ప్రకటించిన రూ. 2 లక్షల లోపు రుణాలను మాఫీ చేసి తీరుతామని స్పష్టం చేశారు సీఎం. బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటేనని ఆరోపించారు. ప్రజలు ఈ విషయం గమనించారని, తమ పార్టీని ఆదరించడం ఖాయమని జోష్యం చెప్పారు .