NEWSTELANGANA

పాస్ పుస్త‌కం ఆధారంగా రుణ మాఫీ

Share it with your family & friends

స్ప‌ష్టం చేసిన సీఎం రేవంత్ రెడ్డి

హైద‌రాబాద్ – రైతుల‌కు శుభ‌వార్త చెప్పారు సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి. తొలి విడ‌త‌గా ఈ నెల 18 వ తేదీ బుధ‌వారం నాటికి అర్హులైన రైతులందరికీ లక్ష రూపాయల మేరకు రుణ మాఫీ చేయ‌నున్న‌ట్లు చెప్పారు. రుణ మాఫీకి రేషన్ కార్డు నిబంధన పెట్టారన్న అంశంపైన ముఖ్యమంత్రి స్పందించారు. ఈ మేర‌కు కీల‌క ప్ర‌క‌ట‌న చేశార. పాస్ బుక్ ఆధారంగానే రైతు కుటుంబానికి రూ. 2 లక్షల పంట రుణ మాఫీ వర్తిస్తుందని చెప్పారు.

కుటుంబాన్ని గుర్తించడానికి మాత్రమే రేషన్ కార్డు అంశాన్ని పరిగణలోకి తీసుకోవాలని అన్నారు.
తొలి విడత రుణ మాఫీ అమలు కాగానే రైతు వేదికల్లో లబ్దిదారులతో కలిసి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు సంబంరాలు నిర్వహిస్తారని చెప్పారు.

రుణ మాఫీ నిధులు పక్కదారి పట్టకుండా ఈ సందర్భంగా ముఖ్యమంత్రి బ్యాంకర్లకు స్పష్టమైన ఆదేశాలిచ్చారు. రుణ మాఫీ కోసం విడుదలైన నిధులను ఇతర ఖాతాల్లో జమ చేసిన పక్షంలో బ్యాంకర్లపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

సచివాలయంలో కలెక్టర్లు, పోలీస్ కమిషనర్లు, ఎస్పీలతో సుధీర్ఘంగా జరిగిన‌ సమావేశంలో రుణ మాఫీపై స్పష్టతనివ్వడంతో పాటు సంక్షేమ పథకాలపై సుధీర్ఘంగా వివరించారు. ప్రభుత్వ కార్యక్రమాలు, పథకాలు చివరి లబ్దిదారుల వరకు చేరవేసే బాధ్యత కలెక్టర్లదేనని గుర్తు చేశారు. జిల్లా కలెక్టర్లు అందరూ క్షేత్రస్ధాయిలో పర్యటించాల్సిందేనని ఆదేశించారు.