ఫేజ్ -2 బిలో డీపీఆర్ తయారు చేయాలి
హైదరాబాద్ – ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. హైదరాబాద్ నగర వాసులకు తీపి కబురు చెప్పారు. మెట్రో ప్రయాణీకుల ఇబ్బందులు తొలగించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. శామీర్ పేట్, మేడ్చల్ వరకు మెట్రో మార్గాలను విస్తరించాలని నిర్ణయించారు. జేబీఎస్ నుండి శామీర్ పేట్ వరకు 22 కిలోమీటర్లు, ప్యారడైజ్ నుండి మేడ్చల్ దాకా 23 కీలోమీటర్ల వరకు మెట్రో రైలు మార్గానికి ఓకే చెప్పారు.
మెట్రో రైల్ ఫేజ్ -2 బిలో భాగంగా వీటిని చేపట్టనున్నట్లు స్పష్టం చేశారు సీఎం ఎ. రేవంత్ రెడ్డి. దీని వల్ల ప్రయాణీకులకు మరింత వెసులుబాటు కలుగుతుందన్నారు. పెద్ద ఎత్తున నగర వ్యాప్తంగా మెట్రో సర్వీసులను విస్తరించాలని స్పష్టం చేశారు ఇప్పటికే.
ఇందులో భాగంగానే మెట్రో రైల్ నిర్మాణం పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు ఎ. రేవంత్ రెడ్డి. ఇదిలా ఉండగా ఫేస్ -2 కింద విస్తరణ పనులు చేపట్టేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినందుకు సీఎంకు ధన్యవాదాలు తెలిపారు రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్. ఆయన నగర వాసుల తరపున కృతజ్ఞతలు తెలియ చేస్తున్నట్లు పేర్కొన్నారు.