DEVOTIONAL

గ‌ణ‌నాథా తెలంగాణ‌ను చ‌ల్లంగ చూడు

Share it with your family & friends

వినాయ‌క చ‌వితి శుభాకాంక్ష‌లు

హైద‌రాబాద్ – వినాయక చవితి సందర్భంగా తెలంగాణ‌ రాష్ట్ర ప్రజలందరికీ రాష్ట్ర ముఖ్య‌మంత్రి ఎ. రేవంత్ రెడ్డి శ‌నివారం శుభాకాంక్షలు తెలిపారు . తెలుగు వారంద‌రూ బాగుండాల‌ని, వారు చేసే ప‌నుల‌కు ఆటంకం క‌ల‌గ‌కుండా చూడాల‌ని గ‌ణ‌నాథుడిని ప్రార్థిస్తున్న‌ట్లు తెలిపారు.

విఘ్నేశ్వరుడు అనుగ్రహంతో ఖ‌మ్మంలో ముంపు తీవ్రత తగ్గి, సాధారణ పరిస్థితులు ఏర్పడాలని… బాధిత ప్రజలను కాపాడేందుకు ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు నిర్విఘ్నంగా సాగాలని…రైతులు, పాడి రైతులు, మత్స్యకారులు అధిక వర్షాల బారి నుండి సురక్షితంగా బయట పడాలని..
ఆ గణనాధుడుని వేడుకుంటున్న‌ట్లు తెలిపారు.

ఆది దేవుడిగా పూజలు అందుకునే గణనాథుడు తొలి పూజ అందుకుని ప్రజలందరికి శుభాలు కలుగ చేయాలని, ఇబ్బందులు తొలగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న‌ట్లు పేర్కొన్నారు.

ప్ర‌జా ప్రభుత్వ హయాంలో రాష్ట్ర అభివృద్ధి నిరాటంకంగా కొనసాగాలని మహా గణపతిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు ఎ. రేవంత్ రెడ్డి.