ఆగస్టు లోపు 2 లక్షల రుణ మాఫీ
సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి
హైదరాబాద్ – తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు రుణ మాఫీకి సంబంధించి. ప్రజా భవన్ లో రేవంత్ రెడ్డి , ఉప ముఖ్యమంత్రి భట్టి, మంత్రుల సమక్షంలో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ కీలక సమావేశంలో రైతుల రుణాల మాఫీకి సంబంధించి ప్రకటన చేశారు.
ఈ ముఖ్యమైన సమావేశానికి పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు హాజరయ్యారు. రుణ మాఫీ కార్యక్రమం అమలు చేసేందుకు నిద్రలేని రాత్రులు గడిపామని చెప్పారు ఎనుముల రేవంత్ రెడ్డి.. రూపాయి రూపాయి పోగుచేసి ఈ కార్యక్రమం చేపట్టామని అన్నారు. గురువారం సాయంత్రం 4 గంటల లోపు రూ. 1 లక్ష రైతుల ఖాతాలలో జమ చేస్తామని పేర్కొన్నారు.
అర్హులైన అన్ని కుటుంబాలకు రుణ మాఫీ చేయడం జరుగుతుందన్నారు. రేషన్ కార్డులు లేని ఆరు లక్షల మంది రైతు కుటుంబాలకు రుణ మాఫీ అందుతుందని చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. పార్టీకి చెందిన ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు ప్రతి పోలింగ్ బూత్ , ప్రతి ఓటర్ దగ్గరకు తీసుకు వెళ్లాలని సూచించారు. తల ఎత్తుకుని..ఎక్కడా తగ్గకుండా ప్రచారం చేయాలని పిలుపునిచ్చారు సీఎం.