సబితక్కా అంటే సారీ చెప్పాలా..?
సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి
హైదరాబాద్ – తెలంగాణ రాష్ట్ర శాసన సభలో బుధవారం తీవ్ర గందరగోళం చోటు చేసుకుంది. అధికార పక్షం ప్రతిపక్షాల మధ్య నువ్వా నేనా అంటూ మాటల యుద్ధానికి తెర తీశారు ఎమ్మెల్యేలు. ప్రధానంగా సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారానికి దారి తీసేలా చేశాయి.
ఎవరిని నమ్ముకున్నా పర్వాలేదు..కానీ మాజీ మంత్రి సబితా ఇంద్రా రెడ్డిని మాత్రం నమ్ముకుంటే మాత్రం బతుకు బస్టాండే అవుతుందంటూ ఎద్దేవా చేశారు. దీనిపై తీవ్ర అభ్యంతరం తెలిపారు ఎమ్మెల్యేలు సునీత, సబితా ఇంద్రారెడ్డి.
సీఎం రేవంత్ రెడ్డి బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తూ కేటీఆర్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యేలు వాకౌట్ చేశారు. స్పీకర్ పోడియం ముందు నిరసన వ్యక్తం చేశారు. తాను సబితక్కా అంటే ఎందుకు అంత ఉలికిపాటు అని మండిపడ్డారు.
తెలంగాణ భాషలో అక్కా అనడం అనేది అలవాటేనని , దీనిని కూడా వేరే కోణంలో అర్థం చేసుకుంటే ఎలా అని ప్రశ్నించారు సీఎం రేవంత్ రెడ్డి. మరో వైపు జోక్యం చేసుకున్న భట్టి విక్రమార్క షాకింగ్ కామెంట్స్ చేశారు. కాంగ్రెస్ పార్టీని మోసం చేసిన చరిత్ర సబితది కాదా అని ప్రశ్నించారు.