NEWSTELANGANA

భారీ వ‌ర్షం అపార నష్టం – సీఎం

Share it with your family & friends

రూ. 5 వేల కోట్ల‌కు పైగా న‌ష్టం వాటిల్లింది

ఖ‌మ్మం జిల్లా – భారీ వ‌ర్షాల వ‌ల్ల జన జీవితం అత‌లా కుత‌లం అయ్యింద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు సీఎం ఎ. రేవంత్ రెడ్డి. వ‌ర్ష ప్ర‌భావిత ప్రాంతాల‌ను ప‌ర్య‌టించారు. బాధితుల‌తో మాట్లాడారు. అనంత‌రం ఖ‌మ్మం స‌మీక్షా స‌మావేశంలో ముఖ్య‌మంత్రి మాట్లాడారు.

భారీ వర్షాల వల్ల 16 మంది ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. క్షేత్రస్థాయి నష్టాలను పరిశీలించేందుకు వచ్చానని అన్నారు. ప్రభుత్వం అండగా ఉంటుందనే విశ్వాసం కల్పిస్తున్నామ‌ని చెప్పారు రేవంత్ రెడ్డి.

వరదల కారణంగా అంటురోగాలు వచ్చే ప్రమాదం ఉందని, వైద్య ఆరోగ్య శాఖాధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. తక్షణం స్పందించడం ద్వారా నష్టాన్ని తగ్గించామ‌ని చెప్పారు సీఎం.

భేషజాలకు పోకుండా కేంద్ర ప్రభుత్వం తో మాట్లాడి సాయం కోరామ‌ని అన్నారు. తక్షణమే జాతీయ విపత్తు గా ప్రకటించాలని డిమాండ్ చేశారు.

నాలుగు నుంచి ఐదు లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని చెప్పారు. వర్షాల వల్ల రాష్ట్రంలో 5438 కోట్ల నష్టం జరిగింద‌న్నారు. తెలంగాణ లో పర్యటించాలని ప్రధానమంత్రి మోదీకి విజ్ఞప్తి చేశామ‌న్నారు. పక్క రాష్ట్రంలో ప్రతిపక్ష నేత ప్రజల దగ్గర కు వెళ్తున్నారని ఆరోపించారు.

తెలంగాణ లో ప్రతిపక్ష నేత మౌన ముద్ర దాల్చారంటూ కేసీఆర్ పై సెటైర్ వేశారు సీఎం.