DEVOTIONAL

ఆధ్యాత్మిక స్పూర్తి కోస‌మే హెరిటేజ్ ట‌వ‌ర్

Share it with your family & friends

ముఖ్య‌మంత్రి అనుముల రేవంత్ రెడ్డి

హైద‌రాబాద్ – హ‌రే కృష్ణ హెరిటేజ్ ట‌వర్ కార్య‌క్ర‌మానికి రావ‌డం త‌న పూర్వ జ‌న్మ సుకృత‌మ‌ని అన్నారు తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి ఎ. రేవంత్ రెడ్డి. ఆదివారం హైద‌రాబాద్ లో హరే కృష్ణ హెరిటేజ్ టవర్ శంఖుస్థాపన కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొని ప్రసంగించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రావడంతో త‌న జ‌న్మ ధ‌న్య‌మైంద‌న్నారు సీఎం. కాంక్రీట్ జంగిల్ లో ఆధ్యాత్మిక స్ఫూర్తిని అందించేందుకు ఇక్కడ హెరిటేజ్ టవర్ నిర్మిచడం గొప్ప విషయం అని పేర్కొన్నారు సీఎం.

ఈ టవర్ 430 అడుగుల ఎత్తు నిర్మితం కావడం రాష్ట్రానికి గర్వకారణమ‌ని పేర్కొన్నారు రేవంత్ రెడ్డి. 36 లేదా 40 నెలల్లో ఈ టవర్ నిర్మణం పూర్తి అవుతుందని చెప్పారు. అది మళ్లీ మనమే ప్రారంభించుకుంటామ‌ని చెప్పారు సీఎం.

ఇది చరిత్రలో నిలిచి పోయే గొప్ప సందర్భంగా అభివ‌ర్ణించారు రేవంత్ రెడ్డి. వందేళ్ల క్రితమే హైదరాబాద్ ను నిజాం లేక్ సిటీగా అభివృద్ధి చేశామ‌ని చెప్పారు.

కోట్లాది మంది దాహార్తిని తీర్చే చెరువుల పరిధిలో విలాసాల కోసం కొందరు ఫామ్ హౌస్ లు నిర్మించుకున్నారని ఆరోపించారు. నగరానికి తాగునీరు అందించే గండిపేట్, హిమాయత్ సాగర్ లోకి ఫామ్ హౌస్ ల నుంచి వ్యర్ధ జలాలు వదులుతున్నార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు సీఎం.